ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసు తిరిగి తిరిగి భార్య విషిత మీదకి వచ్చేలా ఉంది......

ఉదయ్ కిరణ్ కేసు యు టర్న్ తీసుకొని విషిత మీదకి వచ్చింది.....


తెలుగు సినిమా యువ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసు లో ఇప్పుడు గొప్ప గొప్ప ట్విస్ట్ లు ఎదురవ్తున్నాయ్ . అందరు ఇది ఆత్మహత్యే ఉదయ్ కి సినిమా ఛాన్స్ లు లేక ఇలా చేసాడు అని అనుకుంటున్నా టైం లో పోలీస్ లు రంగం లోకి దిగి మెల్లగా ఈ కేసు కూపీ లాగడం మొదలెట్టారు .

మొదట ఉదయ్ తండ్రి ని విచారించిన పోలీసుస్ లు ఆయన చెప్పిన సమాచారం తో ఒకసారిగా షాక్ అయ్యారు . “మా వాడికి ఆర్ధికం గా ఎటువంటి బాధలు లేవు .. సినిమాలు కూడా ప్రెసెంట్ రెండు షూటింగ్ లో ఉన్నాయ్ వాటిని మధ్యలో వదిలి వేసి ఆత్మహత్య చేసుకోనేంత పిరికివాడు ఏమి కాదు మా వాడు ..ఇప్పటి వరకు నాతో తనకి సినిమాలు లేవు నేను చనిపోదాం అని అనుకుంటున్నాను అని ఒకసారి కూడా నాతో ప్రస్తావించలేదు,మా వాడికి బయట వ్యక్తులతో కూడా గొడవలు లేవు ” అని చెప్పడం తో పోలీస్ లకి మైండ్ పోయింది . మరి సినిమా కష్టాలు ఏమి లేకపోతే కేవలం పర్సనల్ గొడవల వలే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడ అనే కోణం లో పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు . ఇప్పుడు ఈ కేసు తిరిగి తిరిగి ఉదయ్  భార్య విషిత మీదకి వచ్చేలా ఉంది


No comments:

Post a Comment