హాస్య నటుడు ఏవీఎస్‌కు తీవ్ర అస్వస్థత...
ప్రముఖ
సినీ నటుడు, దర్శకుడు ఏవీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
గత 15 రోజులుగా ఆయన లక్డీకపూల్ లోని
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా
ఉందని, కంట్రోల్ అయ్యే అవకాశాలు తక్కువ
అని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు లివర్
టాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. అపుడు ఆయన కూతురు
లివర్ దానం చేసారు. అప్పటి
నుంచి ఆయన తరచూ అనారోగ్యానికి
గురవుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మరింత
విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

No comments:
Post a Comment